కార్యాలయ సమయమైనా ఖాళీగా దర్శనమిస్తున్న ఎమ్మార్వో ఆఫీసు!
వెల్దుర్తి (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్):కార్యాలయ సమయం ప్రారంభమైనప్పటికీ కర్నూలు జిల్లా వెల్దుర్తి తహసీల్దారు (ఎమ్మార్వో) కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనుల నిమిత్తం మండలంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు, ప్రజలు అధికారుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యాలయం తెరచి ఉన్నప్పటికీ, కుర్చీలు, బల్లలు ఖాళీగా దర్శనమిస్తుండటంతో సర్టిఫికెట్లు, రెవెన్యూ సమస్యలపై వచ్చే ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించని అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం