BREAKING
కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ దుర్గామాత మండపాలకు 400 స్టీల్‌ ప్లేట్ల విరాళం గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు చేసిన వార్డు సభ్యురాలు ప్రతిభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి లంబిని నగర్ వ్యవస్థాపకుడు డోంగ్రే రామయ్య ఇకలేరు ఫ్లై యాష్ లారీలతో బూడిదమయంగా మారుతున్న గ్రామాలు: మండల టిడిపి పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న ఐదో వార్డులో స్వచ్ఛతకు ప్రాధాన్యం భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవతా పరిమళం - మంచినీరు, మజ్జిగ పంపిణీ.. పసిపిల్లలకు వేడి పాలు మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు విడుదల హుబ్బళ్లిలో చెరుకు రైతుల మహా ఆందోళన: జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసం వద్ద భారీ బందోబస్తు!

45వ సచివాలయంలో సిబ్బంది గైర్హాజరు! పనిమీద వచ్చినా కనిపించని ఉద్యోగులు.. సమయపాలన ఏదంటూ ప్రశ్నించిన పురుషోత్తం మురళీకృష్ణ..

Select Suryaa Now
45వ సచివాలయంలో సిబ్బంది గైర్హాజరు!  పనిమీద వచ్చినా కనిపించని ఉద్యోగులు..   సమయపాలన ఏదంటూ ప్రశ్నించిన పురుషోత్తం మురళీకృష్ణ..

(అనంతపురము కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 45వ వార్డు సచివాలయంలో సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పనిమీద సచివాలయానికి వచ్చిన పురుషోత్తం మురళీకృష్ణకు అక్కడ సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విధులకు హాజరయ్యే విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఉద్యోగులు విధి వేళల్లో అందుబాటులో లేకపోతే సామాన్య ప్రజలు ఎవరిని సంప్రదించాలని ఆయన ప్రశ్నించారు. సంబంధిత అధికారులు స్పందించి 45వ వార్డు సచివాలయంలో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై పరిశీలన చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
సచివాలయ సిబ్బంది విధి వేళల్లో అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.