BREAKING
కావలి మున్సిపల్ చైర్మన్ రేసులో కండ్లగుంట మధుబాబు నాయుడు.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ! హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు.

ఫ్లై యాష్ లారీలతో బూడిదమయంగా మారుతున్న గ్రామాలు: మండల టిడిపి పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న

Select Suryaa Now
ఫ్లై యాష్ లారీలతో బూడిదమయంగా మారుతున్న గ్రామాలు:  మండల టిడిపి పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న

అధిక లోడ్లు, అతివేగంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
దుమ్ము, ధూళితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామస్తులు
అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు )డిమాండ్ చేశారు 
పరవాడ: పరవాడ మండలంలోని పరవాడ సినిమా హాల్ జంక్షన్ నుండి బొట్టవానిపాలెం గ్రామం వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఫ్లై యాష్ (బూడిద) రవాణా చేస్తున్న లారీల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యం ఈ మార్గంలో ఫ్లై యాష్‌ను పరిమితికి మించి లోడ్ చేసుకుని లారీలు అధిక వేగంతో ప్రయాణిస్తుండటంతో రహదారులపై పెద్ద ఎత్తున బూడిద పేరుకుపోతోంది. వాహనాలు ప్రయాణించే సమయంలో విపరీతంగా దుమ్ము, ధూళి ఎగసిపడుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ముఖ్యంగా రహదారి పరిసర గ్రామాల్లోని ఇళ్లు, చెట్లు, పరిసర ప్రాంతాలు బూడిదతో నిండిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని వియ్యపు చిన్నా పత్రికా ముఖముగా ఎన్టిపిసి , హిందూజా కంపెనీలకు మరియు పోలీస్ సిబ్బంది వారికి, రెవిన్యూ వారికి తెలియ చేయడం జరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉందని  వియ్యపు చిన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా అధిక లోడుతో అతివేగంగా ప్రయాణిస్తున్న లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఫ్లై యాష్ రవాణా చేసే లారీలు తప్పనిసరిగా టార్పాలిన్ కవర్లతో పూర్తిగా కప్పి రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని, ఓవర్‌లోడింగ్, అతివేగాన్ని నియంత్రించాలని చిన్నా కోరుతున్నారు.
అలాగే రహదారులపై పేరుకుపోయిన బూడిదను తొలగించి, దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా రెవెన్యూ, రవాణా, పోలీస్, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు సమన్వయంతో స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వియ్యపు చిన్నా (మండలతెలుగుదేశంపార్టీఅధ్యక్షులు )
డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని వియ్యపు చిన్నా కోరుతున్నారు.

పరవాడ 

మేజర్ న్యూస్ ప్రతినిధి