BREAKING
పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ దుర్గామాత మండపాలకు 400 స్టీల్‌ ప్లేట్ల విరాళం

భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవతా పరిమళం - మంచినీరు, మజ్జిగ పంపిణీ.. పసిపిల్లలకు వేడి పాలు

Select Suryaa Now
భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవతా పరిమళం - మంచినీరు, మజ్జిగ పంపిణీ.. పసిపిల్లలకు వేడి పాలు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి భక్తి పారవశ్యంలో మునిగితేలుతుండగా, అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్ యువ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు సేవలందిస్తున్నారు. ఎండ, రద్దీతో ఇబ్బందులు పడకుండా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తుండగా, పసిపిల్లలతో వచ్చే కుటుంబాలకు వేడి పాలు అందిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం చేస్తూ వాలంటీర్లు సేవాభావాన్ని చాటుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ క్యూలైన్లలో క్రమశిక్షణ పాటించేలా సహకరిస్తున్నారు. విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా గాంధీ కూడా ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భక్తుల భద్రత, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అధికారుల సమన్వయం, స్వచ్ఛంద సంస్థల సేవలు, యువత భాగస్వామ్యంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి.