పుష్కర ఘాటు వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
సూర్య రెంజల్ : త్రివేణి సంగమ గోదావరి వద్ద కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మంగళవారం మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ గోదావరి నది ఒడ్డున జరుగుతున్నటువంటి పుష్కరాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. జరుగుతున్న పనులలో నాణ్యత లోపం లేకుండా చేపట్టాలని, పూర్తి స్థాయిలో పనులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట బోధన్ ఆర్డీవో విజయ కుమారి సర్పంచ్ షేక్ గియాసోద్దీన్, తహసిల్దార్ శ్రావణ్ కుమార్, ఆర్ ఐ ఫహీం, ఆయా శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.