BREAKING
గాయత్రి దేవికి ప్రత్యేక పూజలు చేసిన వార్డు సభ్యురాలు ప్రతిభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి లంబిని నగర్ వ్యవస్థాపకుడు డోంగ్రే రామయ్య ఇకలేరు ఫ్లై యాష్ లారీలతో బూడిదమయంగా మారుతున్న గ్రామాలు: మండల టిడిపి పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న ఐదో వార్డులో స్వచ్ఛతకు ప్రాధాన్యం భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవతా పరిమళం - మంచినీరు, మజ్జిగ పంపిణీ.. పసిపిల్లలకు వేడి పాలు మున్సిపల్ చైర్‌పర్సన్ రిజర్వేషన్లు విడుదల హుబ్బళ్లిలో చెరుకు రైతుల మహా ఆందోళన: జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసం వద్ద భారీ బందోబస్తు! మందోళ్లగూడెంలో స్మార్ట్‌ కార్డుల పంపిణీ వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో పత్తికొండ డిఎస్పీ తనిఖీలు 'సూర్య' కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు ఇండోర్ చేరుకున్న సీఎం మోహన్ యాదవ్: విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు! బాలి ప్రమాదం తర్వాత వెన్నుముక శస్త్రచికిత్స.. ఆసుపత్రి బెడ్‌పై షారూఖ్ పాటకు ఫిదా అయిన నుష్రత్ భరుచ్చా! రాహుల్ గాంధీ మార్చ్ సందర్భంగా సుప్రీంకోర్టు వద్ద నినాదాలు: సీజేఐ ఎదుట లేవనెత్తిన గౌరవ్ భాటియా.. పిటిషన్‌ను రేపు మెన్షన్ చేయాలని ధర్మాసనం ఆదేశం! 'రణబాలి' సెట్స్‌లో దారుణమైన సీన్.. కంటతడి పెట్టుకోబోయిన బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్!

వెల్దుర్తి మండలంలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు

Select Suryaa Now
వెల్దుర్తి మండలంలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు

వెల్దుర్తి (సూర్య ప్రతినిధి రూలర్ మేజర్ న్యూస్):మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువలు చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్న చందంగా గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి తప్ప ఎలాంటి మార్పు కనిపించడం లేదు.గ్రామంలోని ప్రధాన వీధుల్లో మురికి కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాకుండా, రోడ్ల పక్కనే చెత్తాచెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దోమల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో పాటు కలుషిత వాతావరణం కారణంగా గ్రామంలో జ్వరాలు, ఇతర అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా మరియు మండల అధికారులు స్పందించి, గోవర్ధనగిరి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సూర్య ప్రతినిధి కే రాజశేఖర్