BREAKING
సెలవు రోజుల్లోనూ విద్యాసంస్థల నిర్వహణ.. పీడీఎస్‌యూ ఆందోళన గుత్తి మండలంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించిన విద్యార్థి సంఘం నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నెల రోజుల్లోనే రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం అనంతపురం నగర రూపురేఖలు మార్చడమే లక్ష్యం 20–25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: ప్రసవం తర్వాత కడుపులోనే దూది, కత్తెర.. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం! నీటి కాలువలో కొట్టుకొచ్చిన చిన్నారి మృతదేహం పోలేపల్లి గ్రామ సమీపంలో గుర్తించిన గ్రామస్తులు.. చిన్నారి వివరాలపై ఉత్కంఠ ఫ్రెండ్స్ కల్యాణ మండపంలో వార్డు సమావేశాలు నిర్వహించిన పెద్దిరెడ్డి 1MDB కేసులో కీలక పరిణామం..డ్యుయిష్ బ్యాంక్‌తో ప్రతిపాదిత సమరస ఒప్పందంపై మలేషియా సంప్రదింపులు ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం! కూతురి మృతితో జర్మనీ కార్మిక మంత్రి బార్బెల్ బాస్ సంచలన నిర్ణయం జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం.. జేపీఎఫ్ కార్యాలయం ప్రారంభం ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు! మయూరి అబ్దుల్లా ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రికులకు హిందూ సోదరులు ఘన సన్మానం గిరిజన యువతకు పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు.. మహాధర్నాకు సర్వం సిద్ధం! కొత్తూరు బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలు.. మామగారి కోసం ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ పోస్ట్!

సిరిమానోత్స‌వానికి ఘ‌నంగా ఏర్పాట్లు... మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ సిరిమాను చెట్టుకు సంప్ర‌దాయ‌బ‌ధ్దంగా పూజ‌లు

Select Suryaa Now
సిరిమానోత్స‌వానికి ఘ‌నంగా ఏర్పాట్లు... మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ సిరిమాను చెట్టుకు సంప్ర‌దాయ‌బ‌ధ్దంగా పూజ‌లు

విజ‌య‌న‌గ‌రం, మేజర్ న్యూస్ : శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికార‌త, సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ చెప్పారు.  పైడిత‌ల్లి అమ్మ‌వారికి ప్ర‌తిరూపంగా విజ‌య‌న‌గ‌రం మండ‌లం జొన్న‌వ‌ల‌స గ్రామంలో వెల‌సిన సిరిమాను, ఇరుసుమాను చెట్ల‌కు సంప్ర‌దాయంబ‌ద్దంగా  సోమ‌వారం అత్యంత ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి కుటుంబ స‌మేతంగా హాజ‌రైన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌, విజ‌య‌న‌గ‌రం శాస‌న‌స‌భ్యురాలు పూస‌పాటి అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు, అమ్మ‌వారి ప్ర‌తిరూపానికి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం చెట్ల‌ను కొట్టి, సిరిమాను, ఇరుసుమాను త‌యారీకి విజ‌య‌న‌గ‌రం హుకుంపేట‌లో పూజారి ఇంటికి త‌ర‌లించేందుకు భారీ బందోబ‌స్తుతో ఏర్పాట్లు చేశార  ఈ సంద‌ర్భంగా మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ, అమ్మ‌వారి సిరిమాను ఉత్స‌వాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం త‌ర‌పున ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. సిరిమానోత్స‌వానికి మ‌న జిల్లా నుంచే కాకుండా, ప్ర‌క్క రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భ‌క్తులు త‌ర‌లివ‌స్తార‌ని, దీనిని దృష్టిలో ఉంచుకొని అందుకు త‌గ్గ ఏర్పాట్ల‌ను చేస్తున్నామ‌ని తెలిపారు. అమ్మ‌వారి ఆల‌యాన్ని విస్త‌రించి, క‌ళాకృతుల‌తో సుంద‌రంగా త‌యారు చేయ‌డం జ‌రిగింద‌ని, విస్త‌ర‌ణ త‌రువాత జ‌రుగుతున్న తొలి పండుగ కావ‌డంతో, విశాల‌మైన ప్రాంగ‌ణంలో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ఇబ్బందులు లేకుండా  ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.

              ఎంఎల్ఏ అదితి గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ, సంప్ర‌దాయ బ‌ద్దంగా ఘ‌నంగా అమ్మ‌వారి పండుగ‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. సిరిమానుచెట్టును హుకుంపేట‌కు త‌ర‌లించి, పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం సిరిమానుగా రూపొందిస్తార‌ని చెప్పారు. సిరిమానోత్స‌వానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి, అమ్మ‌వారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

              కార్య‌క్ర‌మంలో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్‌సి గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు, బిజెపి జిల్లా అధ్య‌క్షులు రాజేష్ వ‌ర్మ‌, పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య ఈఓ శిరీష‌, సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, సిరిమాను చెట్ల దాత‌లు బూర్లి శ్రీ‌నివాస‌రావు, ర‌వి, వారి కుటుంబ స‌భ్యులు, ప‌లువురు కూట‌మి పార్టీల నాయ‌కులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.