నీటి కాలువలో కొట్టుకొచ్చిన చిన్నారి మృతదేహం పోలేపల్లి గ్రామ సమీపంలో గుర్తించిన గ్రామస్తులు.. చిన్నారి వివరాలపై ఉత్కంఠ
అనంతపురం బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని నీటి కాలువలో కొట్టుకుపోతున్న గుర్తుతెలియని చిన్నారి మృతదేహాన్ని స్థానిక గ్రామస్తులు గుర్తించి బయటకు తీశారు.
కాలువలో చిన్నారి మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. చిన్నారి ఎవరు? ఏ గ్రామానికి చెందినది? కాలువలోకి ఎలా వచ్చింది? అనే విషయాలు ప్రస్తుతం తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, చిన్నారి మృతికి గల కారణాలు, ఇతర వివరాలు అధికారుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.