ఫ్రెండ్స్ కల్యాణ మండపంలో వార్డు సమావేశాలు నిర్వహించిన పెద్దిరెడ్డి
పుంగనూరు మేజర్ న్యూస్:
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను చైతన్యపరిచేందుకు ఆదివారం ఫ్రెండ్స్ కల్యాణ మండపం లో వార్డు సమావేశాలను మాజీ మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీలోని అన్ని వార్డులను కైవసం చేసుకుని,
మున్సిపాలిటీ లో పార్టీ జెండాను ఎగురువేద్దమన్నారు.
ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు .ఈకార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష ,షరీఫ్, వెంకట్ రెడ్డి యాదవ్, కొండవీటి నాగభూషణం, చెంగారెడ్డి, రాజేష్, కోటగడ అమర్నాథ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆవుల అమరేంద్ర పెద్ద సంఖ్యలో వైయస్సార్ పార్టీ నాయకులు, పెద్దాయన అభిమానులుకార్యకర్తలుపాల్గొన్నారు
రిపోర్టర్: రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా