BREAKING
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం

బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం..

Select Suryaa Now
బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్  .35 వేల వ్యాయంతో నిర్మాణం..

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్) బాబు క్యాంప్ గ్రామపంచాయతీ ఆవరణలో గల బోర్ పాయింట్ వద్ద వృధాగా పోయే నీటిని ఒడిసి పట్టి, బోర్ వెల్ రీఛార్జ్ సోప్ ఫిట్.. వి బి జి, రామ్ జి కార్యక్రమాన్ని 35 వేల అంచనాతో పనులను బాబు క్యాంప్ గ్రామపంచాయతీ సర్పంచ్ నునావత్ కుమారి, ఉప సర్పంచ్ పోలమూరి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 35వేల అంచనా నిర్మాణంతో బాబు క్యాంపు గ్రామపంచాయతీ ఆవరణలో గల బోర్ పాయింట్ వద్ద  బోర్వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ పనులను 4 మీటర్స్ వెడల్పు,2 మీటర్ల లోతు గొయ్యి తీసి, తద్వారా గొయ్యిలో 2.25 ఎం ఎం పెద్ద రాళ్లును వేసి అనంతరం 1.50 మెటల్ వేసి, మరల 2 ఎం ఎం మెటల్ ను  నింపిన అనంతరం 2 అడుగుల ఇసుకతో గొయ్యిని పూర్తిగా నింపి నీటిని వృధా పోనీయకుండా దీనిద్వారా 300 మీటర్ల బోర్వెల్ కు నిత్యం నీరు అందుబాటులో ఉండే విధంగా బోర్వెల్ రీఛార్జ్ సోఫిట్ విబి జి రామ్ జి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బోర్ లో భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేందుకు,  బోర్  పాయింట్ వద్ద నిత్యం నీరు సమృద్ధిగా ఉండేందుకు, తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు క్యాంప్ గ్రామపంచాయతీ సెక్రటరీ బి. ప్రభాకర్, యశ్వంత్ (ఈసీ), వార్డు మెంబర్లు సదామోహన్, అమ్ములు, కృష్ణవేణి, అరుణ, సహద బేగం, ఎస్.కె ఆఫ్రిన్, నునావత్ మేఘ్య తదితరులు పాల్గొన్నారు.