BREAKING
నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన

అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ

Select Suryaa Now
అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,మండలంలోని అక్కంపేట గ్రామ అంగన్వాడీ కేంద్రానికి టీడీపీ యువనాయకుడు దాకారపు కృష్ణ బీరువాను బహూకరించారు. అంగన్వాడీ కేంద్రానికి బీరువా అవసరమని సిబ్బంది కోరగా, స్పందించిన ఆయన వెంటనే బీరువాను అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు మాట్లాడుతూ దాకారపు కృష్ణ గత తొమ్మిదేళ్లుగా మెట్ట ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానం పొందుతున్నారని అన్నారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతృత్వం, సేవా గుణంతో కృష్ణ మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.అనంతరం దాకారపు కృష్ణను గ్రామస్థులు, అంగన్వాడీ సిబ్బంది, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు తారిపరెడ్డి రామకృష్ణ, సొసైటీ చైర్మన్ గంధం గోపాలకృష్ణ, సొసైటీ సభ్యులు తాళ్లూరు వెంకటేశ్వరరావు, మోతే సిద్ధరావు, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు దోరేపల్లి సురేంద్రకుమార్, పింగుల మంగారావు, పారేపల్లి శ్రీనివాస్, వింజమూరి అలేఖ్య, ఇంజమూరి మహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు దేవి, చంద్రకళ, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 రిపోర్టర్: కెవి రమణ రావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.