BREAKING
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపం కాణిపాకంను సందర్శించిన బిజివేముల వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు ఐపీఓ ప్రకటనతో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ వేతనం వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల బరిలో మారిన మెరీన్ లే పెన్ వ్యూహం బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండగా ప్రభుత్వం కోర్టులో పెప్సికో, మాన్స్టర్ సంస్థలకు ఊరట యువతకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలి పరిశోధనల దశ దాటి వాణిజ్య ఉత్పత్తి వైపు అణు కలయిక శక్తి నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..! రైతులకు అందుబాటులో యూరియా, డిఎపి ఎరువులు పౌరుల రక్షణకు పోలాండ్ భారీ బడ్జెట్

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్

Select Suryaa Now
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్

అనంతపురం బ్యూరో : కళ్యాణదుర్గం నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. దైవ ప్రసాద్ జిల్లా ఎస్పీ పి. జగదీష్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఈ సందర్భంగా కళ్యాణదుర్గం సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ జగదీష్ డీఎస్పీ దైవ ప్రసాద్‌కు దిశానిర్దేశం చేశారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలని సూచించారు.

అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించాలని దైవ ప్రసాద్‌కు తెలిపారు.