BREAKING
స్మశానాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆర్డీవో, తాహసిల్దార్ ను ఆశ్రయించిన మహిమలూరు గ్రామస్తులు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపం కాణిపాకంను సందర్శించిన బిజివేముల వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు ఐపీఓ ప్రకటనతో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ వేతనం వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల బరిలో మారిన మెరీన్ లే పెన్ వ్యూహం బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండగా ప్రభుత్వం కోర్టులో పెప్సికో, మాన్స్టర్ సంస్థలకు ఊరట యువతకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలి పరిశోధనల దశ దాటి వాణిజ్య ఉత్పత్తి వైపు అణు కలయిక శక్తి నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..! రైతులకు అందుబాటులో యూరియా, డిఎపి ఎరువులు

అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

Select Suryaa Now
అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

-అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
నంద్యాల అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు నంద్యాల కలెక్టరేట్‌ లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో అపోలో టైర్స్ లిమిటెడ్‌ (ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌), టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అపోలో టైర్స్‌లో డిప్లొమా, ఐటీఐ (ఎన్‌సీవీటీ తప్పనిసరి), డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశాలు ఉండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. శారీరక ప్రమాణాల్లో కనీసం 163 సెం.మీ. ఎత్తు, 50 కిలోల బరువు ఉండాలని సూచించారు. అదేవిధంగా టాటా ఎలక్ట్రానిక్స్‌లో మొబైల్‌ అసెంబ్లీ విభాగంలో అసోసియేట్‌ ఉద్యోగాలకు 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు కలిగిన వారు హాజరుకావచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్‌/సీవీ, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువత ముందస్తుగా kaushalam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు అందుబాటులోకి వచ్చిన ఈ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.