నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: దక్షిణ చిరువోలులంక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, కాంట్రాక్టర్ బచ్చు నాగమల్లేశ్వరరావు (బుజ్జి) మృతి చెందడంతో మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు బచ్చు వెంకటరాయుడు, బచ్చు ఆంజనేయులు, బాడిగ నాంచారయ్య, అరవ హరిప్రసాద్, పర్చూరు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.-అజంతా శ్రీనివాస్