మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రాహు కేతువు లాగా దాపురించాయి
వేంపల్లె మేజర్ న్యూస్:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల పాలిట రాహుకేతువులుగా దాపురించాయని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మాటలు కోటలు దాటుతున్నాయని, తెడ్డు మాత్రం గడప దాటడం లేదు అన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఉందన్నారు. 2026 గురించి మాట్లాడకుండా పదేపదే 2047 గురించి మాట్లాడడం ఇద్దరికీ పరిపాటి అయిందన్నారు. నిత్యవసర సరుకుల ధరలు సామాన్యునికి అందుబాటులో లేవన్నారు. ఏమి కోనేలా, తినేలా లేవని, గృహిణిలు వంటగదికీ పోవాలంటే భయపడి పోతున్నారని వాపోయారు. నిత్యవసర సరుకుల ధరల నియంత్రణలో ఘోర వైఫల్యం చెందాయని ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల్లో ప్రజలు తమ ఓట్ల ద్వారా ఎన్డీఏ కూటమి పార్టీలకు వాతలు పెట్టాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రమణ్యం, దృవకుమార్ రెడ్డి, రామకృష్ణ, అమర్, ఉత్తన్న, రవీంద్రారెడ్డి, వెంకటేష్, వేమయ్య, బద్రీ, రాఘవయ్య, నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.