BREAKING
విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్ 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమo జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం

వీఆర్‌ హైస్కూల్‌ రాష్ట్రానికే ఆదర్శం: మంత్రి నారాయణ

Select Suryaa Now
వీఆర్‌ హైస్కూల్‌ రాష్ట్రానికే ఆదర్శం: మంత్రి నారాయణ

వీఆర్‌సీ గ్రౌండ్‌కు కొత్త కళ  క్రీడలు, ఆరోగ్యానికి పెద్దపీట.  ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్‌  ప్రభుత్వ పాఠశాలల్లోనూ క్రీడా సదుపాయాల కల్పన

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్న వీఆర్‌సీ గ్రౌండ్‌కు కొత్త హంగులు అద్దేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, వాకర్స్‌, క్రీడాకారులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, షెల్టర్‌, టాయిలెట్ల నిర్మాణ పనులకు తన కుమార్తె షరణితో కలిసి శంకుస్థాపన చేశారు. బాస్కెట్‌బాల్‌ కోర్టును కూడా ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువులతో పాటు విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. వీఆర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఇండోర్‌, అవుట్‌డోర్‌ జిమ్‌లు, వాకింగ్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, షెల్టర్‌, టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ హైస్కూళ్లలోనూ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

18 పాఠశాలలకు ఆధునిక హంగులు  :  నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 18 ప్రభుత్వ హైస్కూళ్లను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. వీఆర్‌ హైస్కూల్‌ను రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని,  ఈ పాఠశాలకు స్వచ్ఛ అవార్డు కూడా లభించిందని చెప్పారు. అదే స్ఫూర్తితో డీఎస్సార్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు.
పాఠశాలల అభివృద్ధికి తన స్నేహితులు, పూర్వ విద్యార్థులు, ఉన్నత స్థాయిలో ఉన్న తన పరిచయస్తుల సహకారాన్ని తీసుకుంటానని  చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిని అభినందిస్తుంటే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని,వారి అవాకులు, చవాకులను నేను పట్టించుకోనన్నారు.పేద విద్యార్థులకు మెరుగైన విద్య, క్రీడా సదుపాయాలు అందించడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు.అనంతరం 14వ డివిజన్‌లోని ఎంఎస్‌ఎం హైస్కూల్‌, మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలను మంత్రి పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

డాక్టర్ పోకల రవికి ప్రశంసాపత్రం  : వీఆర్‌సీ గ్రౌండ్‌లో జెండా పోల్‌ ఏర్పాటుకు రూ.20 వేల విరాళం అందించిన డాక్టర్‌ పోకల రవిని మంత్రి నారాయణ అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పంపిన ప్రశంసాపత్రాన్ని ఆయనకు అందజేశారు. వీఆర్‌సీ గ్రౌండ్‌లో మెరుగైన సదుపాయాల కోసం తమ కోరికను నెరవేరుస్తున్న మంత్రి నారాయణకు వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేటర్‌ కర్తం ప్రతాప్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ హిమబిందు, ఎస్‌ఈ జానీ, డీఈవో బాలాజీరావు, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, టీడీపీ నాయకులు యశ్వంత్‌రెడ్డి, డాక్టర్‌ పోకల రవి, సుజన్‌, పిట్టి సత్యనాగేశ్వరరావు, ఏడుకొండలు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సుబ్బారెడ్డి, బాబు, నన్నే సాహెబ్‌, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.