BREAKING
సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్ 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమo జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పోస్టాఫీసు ద్వారా ఇంటికే కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం

Select Suryaa Now
పోస్టాఫీసు ద్వారా ఇంటికే కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం

భక్తులకు మరింత చేరువగా ప్రసాదం.. సమీప పోస్టాఫీసులో బుకింగ్ సౌకర్యం

మార్కాపురం మేజర్ న్యూస్:

శ్రీ కనకదుర్గ అమ్మవారి భక్తులకు భారత తపాలా శాఖ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఇక భక్తులు తమ ఇంటి వద్దకే పొందే విధంగా పోస్టాఫీసు ద్వారా హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పించింది. దీంతో దూర ప్రాంతాల్లో నివసించే భక్తులు ఆలయానికి ప్రత్యక్షంగా వెళ్లకుండానే అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఇంటి వద్దే పొందే అవకాశం ఏర్పడింది.భక్తులు తమ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించి శ్రీ కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసిన ప్రసాదాన్ని తపాలా శాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా ప్యాక్ చేసి, ఇండియా పోస్ట్ ద్వారా భక్తులు అందించిన చిరునామాకు పంపిస్తారు. దీంతో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న భక్తులకు ప్రసాదం పొందడం మరింత సులభతరం కానుంది.ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో నివసించే భక్తులు, వృద్ధులు, ఆలయానికి ప్రత్యక్షంగా వెళ్లలేని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. పోస్టాఫీసు ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపించే విధానం భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, తపాలా శాఖ సేవలను మరింత విస్తరించేలా ఉందని అధికారులు తెలిపారు.భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఇంటి వద్దనే పొందాలని మార్కాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ జి.వి. శ్రీనివాసులు కోరారు.