పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం
అశ్వారావు పేట, మేజర్ న్యూస్ :అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో మంగళవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం పంట పొలాలను పరిశీలించింది. నారాయణపురం, అశ్వారావుపేట, తిరుమలకుంట క్లస్టర్ల పరిధిలో సాగు చేస్తున్న వరి పంటలను శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కొన్ని వరి పొలాల్లో ఆకుమాడు తెగులు (బి ల్ బి ) లక్షణాలను గుర్తించారు. తెగులు వ్యాప్తికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.
తెగులు సోకిన పొలాల్లో అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పొలంలో తేమ పరిస్థితులను సమతుల్యంగా ఉంచాలని సూచించారు. తెగులు తీవ్రతను బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగిన శిలీంద్రనాశక మందులైన స్ట్రెప్టోసైక్లిన్
లీటరు నీటికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ లేదా అగ్రి మైసిన్ 1 గ్రాముల పిచికారీ చేయాలి.
• కాసుగామైసిన్: కాసుగామైసిన్ 3% ఎస్ఎల్ కూడా పిచికారీ చేయవచ్చు.
*అలాగే యూరియా అధిక మోతాదులో వేయ వద్దు. రైతులకు తెలియ జేశారు
రైతులు తమ పొలాలను తరచుగా పరిశీలిస్తూ, ఆకులపై మచ్చలు, మెడ భాగంలో నల్లటి మచ్చలు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం సూచించింది.ఈ బృందం లో డా. రాంప్రసాద్, డా. నీలిమ, డా. శ్రీజన్ మరియు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు,రైతులు పాల్గొన్నారు.
సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ వరి పంటలో ఆకుమాడు తెగులు వ్యాప్తిని నియంత్రించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.
మునీర్, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.