విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన గుడ్లు అందించాలి – ఎస్ ఎఫ్ ఐ
అనంతపురం బ్యూరో : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆదేశాలతో స్కూల్ బచావో కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ లో ఉన్న కోట హై స్కూల్ లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు మరియు నాణ్యమైన గుడ్లు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి నవీన్ యాదవ్ డివైఈవోకి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను మెరుగుపరచాలని, ప్రతి రోజు పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని డివైఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయ్ , వంశీ, తదితరులు పాల్గొన్నారు.