BREAKING
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు కోనప్ప జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ పిలుపు సౌర విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గించుకోవాలి స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా పనిచేయాలి పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పరిటాల సునీత దిశానిర్దేశం విద్యుత్ లో వోల్టేజీ తో పంటలు ఎండుతున్నాయి. అడవులదీవి టిడిపి పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశం ఏపీలో మీసేవలో కీలక సేవలు పునరుద్ధరించాలి రెవిన్యూ లో పనులు జరగడం లేదు... రీసర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్ల తప్పులు తడక బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ముమ్మరం.... ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ....... జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు. కరువు పైన రైతుల అగ్రహానికి గురికావద్దు సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు - సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరి పోలాలను పరిశీలించిన శాస్త్ర వేత్తలు.!. వి బి జి రామ్ పనులను పరిశీలించిన జడ్పి సీఈవో

కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం

Select Suryaa Now
కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులు, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర సమయాల్లో బాధితులకు సహాయ చర్యలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.నూతన కార్యవర్గ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించి పేదలు, నిరుపేదలు, బాధితులు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని సూచించారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. సమాజ హితం కోసం నూతన కార్యవర్గం అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ ఆర్‌.ఎస్‌. చిత్రు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రతినిధులు ఆడే క్రాంతి కుమార్, మనోహర్, సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.