రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం
అశ్వారావుపేట, మేజర్ న్యూస్ :ములకలపల్లి మండల కేంద్రానికి సమీపంలోని రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. గతంలో తుఫాన్ కారణంగా పాములేరు వంతెన దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ద్వారా రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో వంతెన సమీపంలోనే డైవర్షన్ రహదారి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులకు మంజూరు చేయించారు
ఇందులో భాగంగా డైవర్షన్ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి జహీర్,బత్తుల అంజి,తాండ్ర ప్రభాకర్ రావు,పేటేటి నరసింహరావు ,కారం సుధీర్,ఎమ్మార్వో స్వాతి బిందు,ఎంపీడీవో సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
మునీర్, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.