శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సూర్య,వేములవాడ:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం ముగించుకున్న కవితకి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఏఈవో జయ కుమారి శేషవస్త్రం సమర్పించగా, ఏఈవోలు నాగుల మహేష్, లక్ష్మణరావు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.