BREAKING
కడప కలెక్టర్ కార్యాలయంలో డియర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం

సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు

Select Suryaa Now
సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు

కడియం,జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చుకుంటూ ప్రముఖ దాత, టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి ఆదర్శంగా నిలిచారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధవళేశ్వరం, నామవరం, బొమ్మూరు తదితర గ్రామాల్లోని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, మహారోగుల ఆశ్రమాలను సందర్శించి అక్కడి వారికి భోజనం, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు.

అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం, పేదలు, వృద్ధులు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తన వంతు సహాయాన్ని అందించడం తాడాల విష్ణు చక్రవర్తి నిరంతరం కొనసాగిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. జన్మదినం వంటి ప్రత్యేక సందర్భాలను కూడా సమాజ సేవకు వినియోగిస్తూ ఆయన చూపుతున్న సేవా స్ఫూర్తిని పలువురు అభినందించారు.

సమాజానికి మన వంతు సహాయం చేయడమే నిజమైన సంతృప్తి అనే భావనతో చక్రవర్తి చేపడుతున్న సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, చిరుకూరి రామకృష్ణ, సాపిరెడ్డి కామేష్, సర్కార్ భాష, ఆకుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.