BREAKING
కడప కలెక్టర్ కార్యాలయంలో డియర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం

బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి

Select Suryaa Now
బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్ ; తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో భారతీయ జనతా పార్టీ నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు కాశీ విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆయన తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం పార్టీ సంస్థాగత విషయాలు, రాబోయే కార్యక్రమాలు, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్: శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.