BREAKING
మూల మల్ల లో అభివృద్ధి పనులు ప్రారంభం స్థానిక ఎన్నికల్లో వైకాపా గెలుపే లక్ష్యం సోమన్నకు షోలాపూర్‌లో ఘన సన్మానం నెల్లూరు జిల్లాలో 60 వేలకుపైగా రైతు కుటుంబాల సమస్యలు పరిష్కరించాలి కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇంధన షాక్‌లు, పెరుగుతున్న అప్పులపై ఐఎంఎఫ్ చీఫ్ హెచ్చరిక నంద్యాల టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు క్షీణించిన సౌతాఫ్రికా రాండ్ విలువ లాభాల పునరుద్ధరణే లక్ష్యంగా లగ్జరీ కార్ల దిగ్గజం వ్యూహాలు మలావి ఆర్థిక రంగానికి ఐఎంఎఫ్ భరోసా 2వ డివిజన్‌లో కూటమి ఇంటింటి ప్రచారం స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలి ఆర్థిక సహాయం అందజేస్తున్న పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఒక్క రోజే 9 డివిజన్లలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన. మహిళలు ఆపద సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ఉపయోగించుకోవాలి -మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం

బికరి తండా లో ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు

Select Suryaa Now
బికరి తండా లో ఘనంగా పోషణ మహోత్సవ వేడుకలు

బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'పోషణ మాసం' వేడుకలు
* గ్రామ సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు.
* గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: అంగన్‌వాడీ టీచర్ బి. కవిత.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి: ఏఎన్ఎం ఉపేంద్రమ్మ, కార్యదర్శి ఇంతియాజ్

సూర్య కూసుమంచి న్యూస్ /పాలేరు ఇంచార్జ్ (ఇరుగు శ్రీను)::
కూసుమంచి మండల పరిధిలోని బికారి తండ అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ మాసం' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మాధవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంతియాజ్, గ్రామ పెద్ద బానోతు వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించారు. గ్రామ పెద్ద బానోతు వెంకన్న-ధనమ్మ దంపతులు గర్భిణీ స్త్రీలకు చీర, పూలు, పండ్లు, పసుపు-కుంకుమలతో ఓడి నింపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవి మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
అనంతరం అంగన్‌వాడీ టీచర్ బి. కవిత మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల మరియు వారు తీసుకోవాల్సిన పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను, పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.
మండల ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం ఉపేంద్రమ్మ, పంచాయతీ కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ (ప్రసవాలు) అయ్యేలా చూసుకోవాలని, తద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు నీలమ్మ, భద్రమ్మ, స్థానిక స్కూల్ టీచర్, ఆశా వర్కర్లు సోనీ, నీల, పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.