నంద్యాల టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాలకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ఏవీ యూత్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల శ్యామ కాల్వ సెంటర్లోని ఉష విమల మానసిక వికలాంగుల మనోవికాస కేంద్రం, ఎస్సార్బీసీ లోని పరివర్తన లైఫ్ సెంటర్, పోలూరు రహదారిలోని జీవనజ్యోతి బ్లైండ్ స్కూల్ పిల్లలకు మూడు పూటలా అల్పాహారం, అన్నదాన కార్యక్రమ నిర్వహణ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏవి అభిమానులు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*మధుబాబు సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*