BREAKING
పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట

స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలి

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలి
  • యూనిట్ సమావేశంలో అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి

పామూరు, మేజర్ న్యూస్ :

త్వరలో జరగనున్న  స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం కావాలని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. బుధవారం పామూరు పట్టణంలో కనిగిరి ఎమ్మెల్యే  డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే యూనిట్ సమావేశం యూనిట్ ఇన్‌చార్జి ఇర్రి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రతి బూత్ పరిధిలో పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమై పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షులు ఉప్పలపాటి హరిబాబు, ఉప సర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్, సయ్యద్ అమీర్ బాబు, యిర్రి కోటిరెడ్డి, షేక్ గౌస్ బాషా, షేక్ హాజీ గౌస్, నొస్సం నాగేంద్ర చారి, మండ్ల రమణయ్య బూత్ కమిటీ ఇన్‌చార్జీలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.