BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం

ఒక్క రోజే 9 డివిజన్లలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన.

Select Suryaa Now
ఒక్క రోజే 9 డివిజన్లలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన.

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   కేవలం శంకుస్థాపనే కాదు ఖచ్చితంగా 30 రోజుల్లో ఈ యొక్క అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకి అందిస్తాం.  నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1, 2, 12, 17, డివిజన్లలో 2.50 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి.   నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడవాడలా ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లు, కాలువలు, కరెంట్, మంచినీటి సౌకర్యం, స్మశానాలు, పార్కులు వివిధ అభివృద్ధి పనుల కోసం ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన అభివృద్ధి పనుల విలువ 966 కోట్ల రూపాయలు.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఇదొక రికార్డ్! చరిత్రలో ఎప్పుడూ ఎరుగని విధంగా, చరిత్రలో ఎవరూ చూడని విధంగా కేవలం రెండు సంవత్సరాల రెండు నెలల్లో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 966 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను మనం సాధించుకున్నాం.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఈ ఘనత ఖచ్చితంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, నగర కమిషనర్ గారు,వీరందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అభివృద్ధి పనులు చేసుకోగలిగాం.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి    మరీ ముఖ్యంగా చెప్పాలంటే నెల్లూరు నగరం నుంచి, నగర కార్పొరేషన్ నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉండటం మన అదృష్టం. ఎందుకంటే చరిత్ర లేని విధంగా అభివృద్ధి పనులు ఇంత పెద్ద ఎత్తున చేసేదానికి మాకు అన్ని రకాలుగా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  వివిధ రకాల మార్గాల ద్వారా నిధులు మొత్తం కూడా సాధిస్తూ, ఈ యొక్క నెల్లూరు దశ, దిశ మార్చే విధంగా భవిష్యత్తులో నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో సహకరిస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  నేను దాదాపుగా 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకుముందు 10 ఏళ్లు ఎమ్మెల్యేగా లేని తృప్తి ఈ రెండేళ్లలో వచ్చింది. కారణం ఏమిటంటే ఈరోజు ఓ శాసనసభ్యుడిగా 'నిన్ను మూడుసార్లు గెలిపించాం, ఏం చేశావ్ మా ప్రాంతానికి?' అని అడిగితే ఏ మూలకు వెళ్లినా, ఏ వీధికి వెళ్లినా సగర్వంగా తల ఎత్తుకుని ఆత్మవిశ్వాసంతో 'ఈ ప్రాంతానికి ఈ పని చేశాను' అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థితిని నాకు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  పై కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.