సోమన్నకు షోలాపూర్‌లో ఘన సన్మానం
సోమన్నకు షోలాపూర్‌లో ఘన సన్మానం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నకు షోలాపూర్‌లో ఘన సన్మానం లభించింది. ప్రముఖ మరాఠీ, తెలుగు రచయిత, అనువాదకుడు, నాటకకర్త డా. లక్ష్మీనారాయణ బొల్లి స్మృతి సాహిత్య మహోత్సవంలో మరాఠీ, తెలుగు కవులు, కళాకారులు, ప్రముఖుల సమక్షంలో బాలసాహిత్య రంగంలో సోమన్న చేస్తున్న విశేష కృషికి సత్కరించారు.
ఈ సందర్భంగా సోమన్న రచించిన ‘చెంగల్వ పుదండ’, ‘పున్నమి వెన్నెల’ పుస్తకాలను ఆవిష్కరించారు. షోలాపూర్‌లో సన్మానం పొందిన సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు అభినందించారు.