BREAKING
పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట

స్థానిక ఎన్నికల్లో వైకాపా గెలుపే లక్ష్యం

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో వైకాపా గెలుపే లక్ష్యం

పత్తికొండ, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు.

బుధవారం ఉదయం పత్తికొండలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మతో కలిసి ఆమె పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ... పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ, పట్టణ మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.