BREAKING
పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట

మహిళలు ఆపద సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ఉపయోగించుకోవాలి -మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం

Select Suryaa Now
మహిళలు ఆపద సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ఉపయోగించుకోవాలి -మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం

సూర్య, నంద్యాలబ్యూరో:మహిళలు ఆపద సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ఉపయోగించుకోవాలనిసిఐ జయరాం కోరారు. బుధవారం నంద్యాల
నంద్యాల పట్టణం లోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల లో శక్తి యాప్ మరియు శక్తి టీమ్ ల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు శక్తి యాప్ లపై మరియు శక్తి టీమ్ లు పనితీరుపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ఏదైనా సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 ఫోన్ నెంబర్లను ఉపయోగించుకోవాలన్నారు. మీకు మీరు సీయో రక్షణ చేసుకోవాలన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాము ద్వారా ఆడపిల్లలకు తెలియజేయడం జరిగిందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మీ చదువులలో మీరు ఎంత బిజీగా ఉన్నారో మీ చదువులు ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడపిల్లల సంరక్షణ కోసం శక్తి టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీకు తెలియకుండానే మీ ఫోన్ లకు ఏదైనా ekyc లువచ్చిన  వాటిని తెరవకపోవడమే మంచిదన్నారు. మీ ఫోన్ లకు ఎటువంటి ఓటీపీలు వచ్చినా వాటిని షేర్ చేసుకోకపోవడమే మంచిదన్నారు. మీకు సంబంధించిన ఫోటోలను 80స్ జనరేషన్ అప్లోడ్ చేయడం వలన మీ సమాచారాన్ని సేకరించి మీ ఫోటోలను మార్ఫింగ్ ద్వారా నీకు బ్లాక్ మెయిలింగ్ చేసే ఆస్కారము ఉందన్నారు. కావున జాగ్రత్తగా ఉండాలని ఏదైనా పోటీ పరీక్షలకు దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు తెలిసిన బంధువులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వన్ స్టాప్ సెంటర్ల సహాయం కోరి మీరు వసతి తీసుకోవాలన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*