BREAKING
భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

ఆర్థిక సహాయం అందజేస్తున్న పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు

Select Suryaa Now
ఆర్థిక సహాయం అందజేస్తున్న పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు

 

 

సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చెరుకుగూడ కు చెందిన మంత్రి లక్ష్మణ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని  పిసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ మరియు సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ ఇటీవల మృతి చెందిన మంత్రి లక్ష్మణ్ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని ఆయన తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా ఎండాకాలంలో మజ్జిగ, చలికాలంలో దుప్పట్లు, అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. ఇదే విధంగా ప్రతిఒక్కరు సేవాభావంతో ముందు నిలవాలని అన్నారు. అందజేసిన వారిలో ఫౌండేషన్ సభ్యులు నోముల రాజ్ కుమార్, కొత్త శ్రీనివాస్, బాదావత్ సాయి కిరణ్, ముల్కల్ల రవి, తదితరులు పాల్గొన్నారు.