బెర్లిన్‌లో..... తెలంగాణ లేజిస్లేచర్ ప్రతినిధులకు ఘన స్వాగతం...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్ నగరానికి చేరుకున్న తెలంగాణ లేజిస్లేచర్ ప్రతినిధులకు బెర్లిన్ విమానాశ్రయంలో తెలంగాణ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుమార్ లకు తెలంగాణ విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ లేజిస్లేచర్ తరఫున చేపట్టిన స్టడీ టూర్‌లో భాగంగా ప్రతినిధి బృందం గురువారం బెర్లిన్ నగరానికి చేరుకుంది.
ఈ పర్యటనలో భాగంగా పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అలాగే అక్కడి పార్లమెంటరీ వ్యవస్థలు, ప్రజా ప్రతినిధుల విధులు, శాసన ప్రక్రియలకు సంబంధించిన అంశాలను పరిశీలించి పరస్పర అనుభవాలను పంచుకోనున్నారు.
బెర్లిన్ విమానాశ్రయంలో తెలంగాణకు చెందిన విద్యార్థులు, ప్రవాస తెలంగాణ వాసులు ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికారు.