అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు
అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తుందని పహాడి షరీఫ్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ పందెం కొండల్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, పహాడీ షరీఫ్ గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఖదీర్, మినాజ్, హబీబ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
-అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.