ఆమనగల్లులో ఈనెల 13న జాబ్ మేళా
టాస్క్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈనెల 13న ఆమనగల్లులోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ యువత విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
అలాగే ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఐక్యత స్వచ్ఛ జలధార కార్యక్రమం ద్వారా తలకొండపల్లి, వెల్దండ మండలాల్లోని 134 గ్రామాల్లో వాటర్ ట్యాంకుల శుభ్రత కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో కల్వకుర్తి మండలంలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత, మహిళలు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.