సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం - డా చినుకని శివప్రసాద్
చౌటుప్పల్ : సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని, అవినీతి అధికారుల గుండెల్లో దింపే బాణమని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ అన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ,అవినీతి కట్టడి చేసేందుకు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.చట్టాలకు అతీతులమని భావించే వారిని చట్ట పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఓపికతో చేసే ప్రతి పోరాటం ఫలితం ఇస్తుందన్నారు.సమాచార హక్కు చట్టం సామాన్యుడికి కొండంత ధైర్యం అని అన్నారు. ఇది ఒక చట్టం మాత్రమే కాదు,పాలనలో పౌరులు భాగస్వామ్యం కావడం.ఈ చట్టాన్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా.. సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలన్నారు.