భక్తిశ్రద్ధలతో ఘనంగా గ్యార్మీ వేడుకలు
ఆమనగల్లు పట్టణంలో ఆదివారం గ్యార్మీ వేడుకలను ముస్లిం మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్ ఆధ్వర్యంలో గ్యార్మి జెండా తో పట్టణంలోని ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మౌలాలి పహాడ్ దర్గా సమీపంలోని గౌసే పాక్ చిల్లా చేరుకున్న ముస్లిం మైనార్టీ సోదరులు మత గురువు హజ్రత్ సయ్యద్ జిలాని పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో చిల్లా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, దువా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి మత గురువు మౌలానా అబ్దుల్ కరీం, మైనార్టీ నాయకులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.