BREAKING
గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి

Weekly Horoscope (వార ఫలాలు) 01 Nov 2026 - 07 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

Select Suryaa Now
Weekly Horoscope (వార ఫలాలు) 01 Nov 2026 - 07 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

01.11.2026 నుండి 07.11.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

మేషరాశి.... (అశ్విని 1 2 3 4, భరణి 1 2 3 4, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

ప్రారంభంలో స్థిరాస్తులు, విద్యా విషయాలలో ఆకస్మిక మార్పులు. గృహ వాతావరణంలో ప్రశాంతత తక్కువ. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరం మేలు. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రణాళిక ముఖ్యం. ఆలోచనత్మక నిర్ణయాలు, సృజనాత్మకత, ఆత్మ స్థైర్యం పెంపొందించుకోవాలి. సంతానము ప్రియమైన వ్యక్తులతో చర్చలలో అభిప్రాయ బేధాలకు తావు ఇవ్వరాదు. ఆకస్మిక లాభాల కొరకు పెట్టుబడులలో వేగవంతమైన నిర్ణయాల వలన ఇబ్బంది కలగకుండా ఆత్మీయులను సంప్రదించాలి. కావలసిన వ్యక్తులతో కమ్యూనికే షన్ జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక చికాకులు అధిగమించాలి. వారాంతం అధిక శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. కుటుంబ స్త్రీల ఆరోగ్య శ్రద్ధ అవసరం. ఖర్చులు అధికం. వృత్తిలో ఒత్తిడి, ఘర్షణలు లేకుండా ధ్యానం అవసరం. సూర్యాష్టకంమేలు.

వృషభరాశి...(కృతిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  

ప్రారంభంలో  అధిక శ్రమతో లక్ష్య సాధన కొరకు చేసే ప్రయత్నాలు, అందులో ఆశించిన వ్యక్తుల సహకారం సామాన్యం. ప్రయాణాలకు అవకాశం. ఆత్మీయులతో భావ వ్యక్తీకరణలో ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. వ్యాపార, భూవ్యవహారాల విషయాలలో మిత్రులు, తోబుట్టువులతో చర్చలు. వారం మధ్యలో స్థిరాస్తులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో పెట్టుబడుల కొరకు ఆకస్మిక వేగవంతమైన నిర్ణయాలు కాకుండా జాగ్రత్తలు అవసరం. గృహ సౌఖ్యం, విద్యా అంశాలు, ఆకస్మిక మార్పులు. విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారాంతం తక్కువ శ్రమతో పనులు సాధించుకునే ప్రయత్నాలు, నెట్వర్క్ సహకారం, విందు వినోదాలు. మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ ముఖ్య విషయాలలో బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.

మిధున రాశి...(మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  

ప్రారంభంలో ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు అనుకూలం. మాటల వల్ల ఆత్మీయ సభ్యులతో అభిప్రాయ బేధాలు, ఘర్షణలు రాకుండా జాగ్రత్తలవసరము. సజ్జన సహకారం, వృత్తిలో శ్రమకి తగిన విలువ, అనుకూలం.భాగస్వామ్య వ్యవహా రాలలో, జీవిత భాగస్వామితో సహకారం లభ్యం. వృత్తిపరమైన ప్రయాణానికి అవకాశాలు. ఉన్నత స్థాయి వ్యక్తులతో కమ్యూనికేషన్లో, సంప్రదింపులలో అహం సమస్యలు లేకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. పెద్దల ఆరోగ్య శ్రద్ధ పై దృష్టి. ఉన్నత విద్యరీత్యా కొత్త ప్రణాళికలు. వారాంతం సంతాన అభివృద్ధి, గృహములో సృజనాత్మక వస్తువుల కొరకు ఖర్చులు. వాహనములు రిపేర్లు, వృత్తిలో అధిక అలసట, శ్రమ, బాధ్యతలు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడుకలో జాగ్రత్తలు అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాలు దర్శించడం మేలు.

కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)

వారం ప్రారంభంలో వృత్తిపరంగా నూతన మార్పులు, కొత్త అవకాశాలు. అధిక ఆలోచనలు, శ్రమ ఒత్తిడి. మానసిక ఉద్వేగాలు అధికం. హృదయాందోళనను అధిగమించాలి. ముఖ్యంగా సంతానము, ప్రియమైన వ్యక్తులతో మాటలలో ఘర్షణ లేకుండా తగినంత ప్రశాంతత అవసరం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ పై దృష్టి సారించాలి. వారం మధ్యలో మాటలలో వేగం, ఆర్థిక అభివృద్ధి, విందు వినోదాలలో పాల్గొనడం. ప్రత్యర్థులపై విజయ సాధన. పెద్దలతో, కుటుంబ సభ్యులతో ఆర్థిక నిర్ణయాలలో ముఖ్యంగా గృహ అనవసర ఖర్చుల్ని, అహం సమస్యలధిగమించాలి. ఉన్నత విద్యలో గురువుల సహకారం లభ్యం. వారాంతం క్రింద సిబ్బంది సహకారంలో ఇబ్బందులు ఉన్న వ్యక్తిగత కృషితో, గృహ సభ్యుల సహకారం తో పనులు పూర్తి. మంచి కమ్యూనికేషన్. గణపతి ఆరాధన మేలు చేస్తుంది. 

సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

ప్రారంభంలో నిద్రలేమి, శ్రమ, ప్రశాంతత తక్కువ. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. మెడిటేషన్తో ఘర్షణాత్మక ఆలోచనలు అధిగ మించాలి. భూమి, రుణ సంబంధ ఒత్తిడి అధికం. తోబుట్టువులతో, తల్లితండ్రులతో చర్చలలో ప్రశాంతత ముఖ్యం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధపై నిర్లక్ష్యం పనికిరాదు. వ్యాపార విస్తరణకై ప్రయాణాలు, శ్రమ. వారం మధ్యలో భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ కొరకు ఖర్చులు. అననుకూల పరిస్థితులలో కూడా అధిక శ్రమతో, లక్ష్యసాధ నతో తలపెట్టిన పనులను పూర్తి చేయడానికి ముందుకు వెళతారు. స్నేహ సంబంధాలు సామాన్యం. వారాంతం తోబుట్టువులకు కుటుంబ సంబంధ ఖర్చులు, షాపింగ్లు. బంధుమిత్రుల కలయిక, డ్రైవింగ్, కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.

కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4, హస్త 4, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)

ప్రారంభంలో ఆశించిన పనులు ముందుకు వెళతాయి. తోబుట్టువులు, మిత్రులు సహకరిస్తారు, నెట్వర్క్ అనుకూలిస్తుంది. భూ వ్యవహారాలు, కమ్యూనికేషన్, వారసత్వ అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉత్సాహం, పరాక్రమం పెరుగుతుంది. వారం మధ్యలో ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రవచనాలపై ఆసక్తి, గురువుల కలయిక, పుణ్యక్షేత్ర సందర్శన, స్థిరాస్తి వ్యవహారాల కొరకు ఖర్చులు, దూర ప్రయాణాలు. నిద్రలేమి, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. విరాళాలు. వారాంతం వ్యాపార వ్యవహా రాలు చర్చలు. ఆర్థిక నిర్ణయాలలో, కుటుంబ వ్యవహారాలలో సభ్యుల మధ్య అహం సమస్యలు లేకుండా ఆలోచనలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తండ్రి పెద్దల ఆరోగ్య శ్రద్ధ. ఆత్మీయుల సలహాలు సమయస్ఫూర్తి నిర్ణయాలు ఉపకరిస్తాయి. అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

తులా రాశి...(చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాల అభివృద్ధిలో అధిక శ్రమ, ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబాటు. కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార చర్చల యందు సామాన్య ఫలితాలు. పలుకుబడి కల వ్యక్తుల సహకారం మిశ్రమం. వారం మధ్యలో వృత్తి పరంగా ఆర్థిక విషయాలు అనుకూలం, సజ్జన సహకారం, సిబ్బంది చర్చలతో, మంచి నైపుణ్యాలతో, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులతో, ఆకస్మిక వృద్ధి. దూర ప్రాంతంలోని వ్యక్తుల ప్రోత్సాహంతో సంతాన పరంగా, సృజనాత్మకంగా, నూతన నిర్ణయాలు. ముఖ్య మైన వ్యవహారాలలో ఆలోచనలు ఆశించిన విధంగా రూపుదిద్దుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు. వారాంతం శ్రమతో పనులు సాధిస్తారు, కంటి ఆరోగ్య శ్రద్ధ, విశ్రాంతి ముఖ్యం. స్త్రీలతో కమ్యూనికేషన్ లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయ పారాయణ మేలు.

వృశ్చిక రాశి...(విశాఖ 4, అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   

వారం ప్రారంభంలో అధిక ఉద్వేగాలకు లోను కాకుండా మానసిక శారీరక ఆరోగ్య శ్రద్ధపై దృష్టి సారించాలి. తండ్రి ,పెద్దలతో చర్చలలో, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనలో ఆసక్తి. ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, ఆర్థిక విషయాలలో ప్రశాంతత తక్కువ. వారం మధ్యలో వృత్తిలో అధికశ్రమ, కొత్త బాధ్యతలు, క్రింద సిబ్బందితో, సహోద్యోగులతో మానసిక ఒత్తిడి అధిగ మించాలి. ముఖ్యంగా పైఅధికారుల, ఉన్నత స్థాయివ్యక్తుల, సహకారాన్ని ఆశించినప్పుడు మాటల వల్ల ఘర్షణ ఏర్పడకుండా వారితో తగిన సమన్వయం అవసరం.కంప్యూటర్ పనులలో కంటి ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వారం చివరిలో మిత్రులతో దీర్ఘ సంభాషణ, నెట్వర్క్ పెంపొందించు కుంటారు, వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు, ఆర్థిక విషయాలలో భాగస్వామి సహకారం సామాన్యం. పెద్దలతో, వృత్తి చర్చలలో, నిర్ణయాలలో కమ్యూనికేషన్ జాగ్రత్తలు ముఖ్యం. శివ ఆరాధన మేలు.

ధను రాశి...(మూల 1 2 3 4, పూర్వాషాఢ 1 2 3 4, ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)

ఆరంభంలో  ముఖ్య పనులలో ఆకస్మిక మార్పులు, సంతానరీత్యా, పెట్టుబడుల కొరకు, స్థిరాస్తి వ్యవహారాల ఆలోచనలు, నిర్ణయాలలో ఉద్వేగాలధికం. మానసిక ప్రశాంతత తక్కువ. డ్రైవింగ్ లో మరియు వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. ఆహార స్వీకరణలో, మాటలలో ఆత్మీయులతో, నూతన అంశాలలో, ఒత్తిడి అదిగమించాలి. మధ్యలో తండ్రి ఆరోగ్య శ్రద్ధ, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, స్థిరాస్తి వ్యవహారాలలో చర్చలు. ఉన్నత విద్య, దూర ప్రయాణాల పై దృష్టి. శ్రమతో వృత్తిలో అధికారుల ప్రోత్సాహంతో, ఉన్నత స్థాయి, పలుకుబడి వ్యక్తుల సహకారంతో పనులు ముందుకు పెడతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తిపరమైన గౌరవం గుర్తింపు. వారాంతం ప్రయాణాలు, వృత్తిలో కొత్త మార్పులు. బాధ్యతలు. ఆర్థిక వృద్ధి. మిత్రుల కలయిక, కమ్యూనికేషన్ అనుకూలం. స్త్రీలతో అభిప్రాయబేధములకు తావివ్వరాదు. దత్త ఆరాధన మేలు.

మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)

వారం ప్రారంభంలో నూతన మైత్రి బంధాలు, భాగస్వామ్య వ్యవహారాలు, సంఘంలో గుర్తింపు గౌరవం, ముఖ్యంగా నూతన వ్యక్తులతో, పరిచయాల్లో ఘర్షణలు ఉద్వేగాలను నియంత్రించు కోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. గృహ, స్థిరాస్తి వ్యవహారాల్లో, తల్లితో, భాగస్వామితో కీలక నిర్ణయాలు. మధ్యలో ముఖ్య వ్యవహారాలలో, ప్రభుత్వ సంబంధ పనులలో ఆలస్యాలు ఆటంకాలు, దూర ప్రాంతంలోని ఆత్మీయులతో చర్చలు, ఆకస్మిక అనవసర ఖర్చులు. దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. భాగస్వామి కుటుంబ పెద్దల ఆరోగ్యంలో సహకరిస్తారు. ముఖ్యపనులలో ఇబ్బందులను ఉన్నతస్థాయి, పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో, ఆత్మవిశ్వాసంతో, అధికశ్రమతో అధిగమించ గలుగుతారు. వారాంతం ఆశించిన సహకారం, ఆర్థికవిషయాలు మంచి కమ్యూనికేషన్తో సాధించుకుంటారు. గౌరీ ఆరాధన మేలు.

కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    

ప్రారంభంలో నైపుణ్యాలను పొందించుకుంటూ శ్రమతో, కృషిశీలతతో, వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులలో అభివృద్ధి. నూతన అవకాశాల కొరకు ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. రుణ విషయాలలో, ప్రత్యర్థుల మీద విజయంలో శక్తి ఉత్సాహాన్ని పెంపొందించుకుంటారు. వారం మధ్యలో ఆర్థిక విషయాలనుకూలం. వ్యాపార వ్యవహారాలలో ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారం, ఆశీస్సులు. జీవిత భాగస్వామి ఆరోగ్యశ్రద్ధ, అధిక ఆత్మవిశ్వాసానికి మరియు వ్యాపారాలలో ముఖ్యంగా అధికారంలో ఉన్న వ్యక్తులతో అహం సమస్యలకు దూరం ఉండాలి. వారం చివరిలో ముఖ్య పనులలో, ఆర్థిక అంశాలలో, చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు. వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన ఆత్మీయుల సహకారంతో నియంత్రించ గలుగుతారు. గణపతి ఆరాధన మేలు.

మీన రాశి...(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

వారం ప్రారంభంలో ఆత్మీయ వ్యక్తులతో, మీ ఆలోచనలలో ఘర్షణను, ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత ముఖ్యం. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలలో, సంతాన వర్గంతో, తండ్రి తరపు బంధువులతో ముఖ్య చర్చలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారం మధ్యలో కృషితో, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలతో వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. సహకరించాల్సిన ఉన్నత స్థాయి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో తగిన సమన్వయాన్ని పెంపొందించుకోవాలి. అనవసర విమర్శలకి అవకాశం ఇవ్వరాదు. వృత్తిలో గౌరవం విషయంలో ఆశించిన గుర్తింపు. వారం చివరిలో వృత్తిలో నూతన పరిచయాలు, కొత్త ఆలోచనలు. సృజనాత్మకత అనుకూలం. కుటుంబములో వృత్తిలో స్త్రీల సహకారం మిశ్రమం. వాదనలకు దూరంగా ఉండాలి.  సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

 

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com