BREAKING
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా

నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం)

Select Suryaa Now
నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం)

నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం)

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం): ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం(కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు): వ్యాపార రంగంలో నూతన అవకాశాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
 

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు): వృత్తిపరంగా ఒత్తిడి తగ్గుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష): ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం): సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక వ్యవహారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
 

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు): వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. నూతన వస్తు, వస్త్ర లాభాలు సూచిస్తున్నాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.
 

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు): ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మనశ్శాంతి లభిస్తుంది.
 

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ): పనుల్లో శ్రమ పెరిగినా చివరకు విజయం మీదే అవుతుంది. నూతన ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూలమైన రోజు. అనవసర వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం): వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
 

మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు): ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తాయి. అనుకున్న పనులు నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.
 

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు): చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతమవుతాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి):దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రద్ధ అవసరం.