మకర రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మకర రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మకర రాశి… వారం ప్రారంభంలో గృహ, వాహన, స్థిరాస్తి, సంబంధాల విషయంలో ఘర్షణలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక మార్పులు, ఖర్చులకు అవకాశాలున్నాయి. భాగస్వామి కుటుంబ సభ్యులతో చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం, డ్రైవింగ్‌లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. వారం మధ్యలో సంతానాభివృద్ధి, నూతన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. పోటీల్లో శ్రమకు గుర్తింపు, సృజనాత్మకత పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వారాంతంలో నైపుణ్యాలు, కృషిశీలత పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి ప్రయత్నిస్తారు. పెద్దల సహకారంతో విజయాలు సాధిస్తారు. అమ్మవారి ఆరాధన మేలు.