వృశ్చిక రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
వృశ్చిక రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Scorpio Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
వృశ్చిక రాశి… వారం ప్రారంభంలో శ్రమ, నైపుణ్యాలతో పనులు సాధిస్తారు. వృత్తిలో వేగవంతమైన నిర్ణయాలు, ఉత్సాహం, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు, విద్యార్థులకు పోటీల్లో గుర్తింపు లభిస్తాయి. ధైర్యం, ఆరోగ్యం అనుకూలించి రుణవిముక్తి, నిలిచిన పనుల పురోగతి ఉంటుంది. మధ్యలో భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వంతో అధికారులతో ఇగో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. తలనొప్పి, కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విదేశీ ప్రయాణాలు, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో వారసత్వ ఆస్తులు, భూ వ్యవహారాలు, బంధువులతో చర్చలు ఒత్తిడి కలిగించవచ్చు. పత్రాలు, సంతకాలు, ఈమెయిల్స్ తనిఖీ చేయాలి. విష్ణుసహస్ర నామాలు మేలు.