వృషభ రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
వృషభరాశి… వారం ప్రారంభంలో గృహ, వాహన, స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక పెట్టుబడులు, ఖర్చులకు నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు ముఖ్యం. నిద్రలేమి, తల్లి ఆరోగ్యం, వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. మధ్యలో ఉత్సాహం, నూతన ఆలోచనలు, మిత్రుల సహకారం, ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులతో చర్చలు, విదేశీ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. స్థిరాస్తి, వ్యాపార విషయాల్లో అధికారులతో సమన్వయం అవసరం. వారాంతంలో కుటుంబ, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు.