మిథున రాశి వారఫలాలు | 22 NOV 2026 - 28 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మిధున రాశి… వారం ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు, సమావేశాలు, దూరప్రాంత ఆహ్వానాలు అనుకూలిస్తాయి. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. ప్రయాణాలు, నిలిచిన ధనప్రాప్తి, మిత్రులు, తోబుట్టువుల సహకారం లభిస్తాయి. కమ్యూనికేషన్లో అపార్థాలు రాకుండా జాగ్రత్తపడాలి. మధ్యలో ఒత్తిడి, అలసట, వృత్తిపరమైన దూరప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది. సంతానం, ఆత్మీయుల కోసం ఖర్చు చేస్తారు. విద్యార్థులకు, రచనా నైపుణ్యాలకు అనుకూలం. వారాంతంలో కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన నిర్ణయాలు, సృజనాత్మకత, మిత్రుల కలయిక, సంతాన సహకారం లభిస్తాయి. లక్ష్యసాధనకు కృషి చేస్తారు. విష్ణుమూర్తి ఆరాధన మేలు.