BREAKING
దట్టమైన పొగమంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక ‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..) సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు! 107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

22.11.2026 నుండి 28.11.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by డా|| ఈడ్పుగంటి పద్మజారాణి

Select Suryaa Now
22.11.2026 నుండి  28.11.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by డా|| ఈడ్పుగంటి పద్మజారాణి

22.11.2026 నుండి 28.11.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope | డా. ఈడ్పుగంటి పద్మజారాణి 

మేషరాశి…వారం ప్రారంభంలో నూతన ఆలోచనలు, ఉత్సాహం, వేగవంతమైన నిర్ణయాలు. సృజనాత్మకతకు, గురువులు, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాసనలో అవరోధాలను అధిగమిస్తారు. వారం మధ్యలో ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు, విందులు లభిస్తాయి. వృత్తి, మాటల విషయంలో ఘర్షణలు నివారించాలి. నిర్ణయాల్లో జాప్యం, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అధికారులతో సౌమ్యంగా ఉండాలి. వారాంతంలో పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులు, భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు, నూతన పరిచయాలు కలుగుతాయి. బంధువుల సహకారానికి సమర్థమైన సంభాషణ అవసరం. ఆదిత్యహృదయ పారాయణం శుభప్రదం.

వృషభరాశి… వారం ప్రారంభంలో గృహ, వాహన, స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక పెట్టుబడులు, ఖర్చులకు నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు ముఖ్యం. నిద్రలేమి, తల్లి ఆరోగ్యం, వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. మధ్యలో ఉత్సాహం, నూతన ఆలోచనలు, మిత్రుల సహకారం, ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులతో చర్చలు, విదేశీ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. స్థిరాస్తి, వ్యాపార విషయాల్లో అధికారులతో సమన్వయం అవసరం. వారాంతంలో కుటుంబ, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు.

మిధున రాశి… వారం ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు, సమావేశాలు, దూరప్రాంత ఆహ్వానాలు అనుకూలిస్తాయి. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. ప్రయాణాలు, నిలిచిన ధనప్రాప్తి, మిత్రులు, తోబుట్టువుల సహకారం లభిస్తాయి. కమ్యూనికేషన్‌లో అపార్థాలు రాకుండా జాగ్రత్తపడాలి. మధ్యలో ఒత్తిడి, అలసట, వృత్తిపరమైన దూరప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది. సంతానం, ఆత్మీయుల కోసం ఖర్చు చేస్తారు. విద్యార్థులకు, రచనా నైపుణ్యాలకు అనుకూలం. వారాంతంలో కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన నిర్ణయాలు, సృజనాత్మకత, మిత్రుల కలయిక, సంతాన సహకారం లభిస్తాయి. లక్ష్యసాధనకు కృషి చేస్తారు. విష్ణుమూర్తి ఆరాధన మేలు.

కర్కాటక రాశి…వారం ప్రారంభంలో వృత్తిపరంగా నూతన ఆలోచనలు, మార్పులు, వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక విషయాలు, అభివృద్ధి అనుకూలిస్తాయి. మాటల్లో వేగం, ఉద్వేగం, ఆకస్మిక నిర్ణయాలు, ఇతరుల జోక్యంతో అసహనం అధిగమించాలి. ఖర్చులు అధికం. ఆరోగ్యం, దంత సంరక్షణపై శ్రద్ధ అవసరం. మధ్యలో ఆలస్యమైనా పెద్దల సహకారం, ఉన్నత విద్య, సంతానాభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలిస్తాయి. గృహం, స్థిరాస్తి, వాహనాలు, బంధుమిత్రుల సహకారం లభిస్తాయి. వారాంతంలో ఒత్తిడి, నిద్రలేమి, ప్రయాణ బడలికలు ఉండవచ్చు. ఆస్తి ప్రయత్నాలు, గృహోపకరణాల కొనుగోళ్లు చేస్తారు. శివాలయ సందర్శన మేలు చేస్తుంది.

సింహరాశి… వారం ప్రారంభంలో తండ్రి, పెద్దలతో చర్చలు, ఉన్నత విద్య, భూ వ్యవహారాల్లో సమన్వయం అవసరం. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కోపం, ఉద్వేగాలు తగ్గించుకుంటూ ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, సంతాన విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఆత్మీయుల సహకారం ముఖ్యం. మధ్యలో వృత్తిపరమైన శ్రమ పెరుగుతుంది. పనులు క్రమశిక్షణతో పూర్తిచేస్తూ విమర్శలు, ఘర్షణలు నివారించాలి. సహోద్యోగులు, అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో ఆశించిన మార్పులు, ప్రశాంతత లభిస్తాయి. నెట్‌వర్క్, సోదరీ వర్గం సహకారం, ప్రయాణాలు, నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. గణపతి దేవాలయ సందర్శన మేలు.

కన్యా రాశి…వారం ప్రారంభంలో పనులు, ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. వారసత్వ ఆస్తులు, భూమి, దీర్ఘకాల పెట్టుబడులు, రుణ విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ, ఆధ్యాత్మిక ప్రయాణాలపై ఆసక్తి, ఖర్చులు, విరాళాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మధ్యలో ఆర్థిక విషయాలు, పెద్దల సహకారం, కుటుంబ వ్యవహారాలు, కమ్యూనికేషన్ అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. వ్యాపార ఆర్థిక వ్యవహారాలు ఆలస్యమైనా ముందుకు సాగుతాయి. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వారాంతంలో వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఆర్థికాభివృద్ధి, గుర్తింపు, గౌరవం పొందుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.

తులా రాశి… వారం ప్రారంభంలో వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహబంధాలు, ప్రయాణాల్లో ప్రశాంతత లభిస్తాయి. భాగస్వామి, జీవితసహచరి, సిబ్బంది సహకారంతో పనులు సాధిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్దల ఆశీస్సులు, దూరప్రాంత వ్యక్తుల సహకారంతో ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతాయి. మధ్యలో వృత్తిపరమైన శ్రమ, బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్య పనుల్లో జాప్యం ఉండవచ్చు. కమ్యూనికేషన్, మాటలు, కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రుణాలు, ప్రత్యర్థుల విషయాల్లో ప్రణాళిక ముఖ్యం. వారాంతంలో దూరప్రయాణాలు, ఉన్నత విద్య, ఆర్థిక అనుకూలత లభిస్తాయి.నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది. 

వృశ్చిక రాశి… వారం ప్రారంభంలో శ్రమ, నైపుణ్యాలతో పనులు సాధిస్తారు. వృత్తిలో వేగవంతమైన నిర్ణయాలు, ఉత్సాహం, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు, విద్యార్థులకు పోటీల్లో గుర్తింపు లభిస్తాయి. ధైర్యం, ఆరోగ్యం అనుకూలించి రుణవిముక్తి, నిలిచిన పనుల పురోగతి ఉంటుంది. మధ్యలో భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వంతో అధికారులతో ఇగో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. తలనొప్పి, కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విదేశీ ప్రయాణాలు, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో వారసత్వ ఆస్తులు, భూ వ్యవహారాలు, బంధువులతో చర్చలు ఒత్తిడి కలిగించవచ్చు. పత్రాలు, సంతకాలు, ఈమెయిల్స్ తనిఖీ చేయాలి. విష్ణుసహస్ర నామాలు మేలు.

ధను రాశి… వారం ప్రారంభంలో ఆలోచనలు, నిర్ణయాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. సంతానం, పెట్టుబడులు, ఆరోగ్య విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. తండ్రి, కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులు ఏకాగ్రతతో ఉన్నత విద్యకు గురువుల సలహాలు పొందాలి. మధ్యలో గృహ, వాహన, స్థిరాస్తి వ్యవహారాలు, రుణాల పరిష్కార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగావకాశాలు, స్త్రీల సహకారం, ప్రత్యర్థులపై విజయం లభిస్తాయి. అధికారులతో ఘర్షణలు నివారించాలి. వారాంతంలో భాగస్వామ్యం, వ్యాపారం, ఆర్థికాభివృద్ధి, ప్రయాణాలు, శుభకార్యాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ప్రశాంతంగా గడుపుతారు. సూర్యష్టకం మేలు చేస్తుంది.

మకర రాశి… వారం ప్రారంభంలో గృహ, వాహన, స్థిరాస్తి, సంబంధాల విషయంలో ఘర్షణలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక మార్పులు, ఖర్చులకు అవకాశాలున్నాయి. భాగస్వామి కుటుంబ సభ్యులతో చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం, డ్రైవింగ్‌లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. వారం మధ్యలో సంతానాభివృద్ధి, నూతన ఉపాధి అవకాశాలు కలుగుతాయి. పోటీల్లో శ్రమకు గుర్తింపు, సృజనాత్మకత పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వారాంతంలో నైపుణ్యాలు, కృషిశీలత పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి ప్రయత్నిస్తారు. పెద్దల సహకారంతో విజయాలు సాధిస్తారు. అమ్మవారి ఆరాధన మేలు.

కుంభ రాశి… వారం ప్రారంభంలో చేపట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నైపుణ్యాలు, పట్టుదలతో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వామి, జీవిత భాగస్వామితో సమన్వయం అవసరం. వ్యక్తిగత ఎదుగుదలకు అనుకూల సమయం. మాటతీరులో సంయమనం పాటించాలి. సాంఘిక, భాగస్వామ్య వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వివాదాలకు కారణమవుతాయి. వారం మధ్యలో కుటుంబ సౌఖ్యం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, తండ్రి తరపు బంధువులతో చర్చల్లో సంయమనం అవసరం. అపార్థాలకు తావివ్వకూడదు. వృత్తిపరంగా పురోగతి కనిపిస్తుంది. వారాంతంలో విద్యార్థులు పోటీల్లో రాణించేందుకు శ్రమించాలి. రచయితలకు కొత్త అవకాశాలు వస్తాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.

మీన రాశి… వారం ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు, సహకారం తీసుకోవడం మంచిది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్య రక్షణపై శ్రద్ధ పెడతారు. కొత్త వృత్తి అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. రుణ విముక్తి, భూమి, వ్యవసాయం ద్వారా ఆదాయం. వారం మధ్యలో నిలిచిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపార పురోగతి, అత్తమామల ఆదరణ, ఆకస్మిక బహుమతులు కలుగుతాయి. సంభాషణలు అనుకూలించి, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో గృహసౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్య, వాహనం, ఆహార విషయాలు అనుకూలిస్తాయి.  సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు.

 

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com