కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
కర్కాటక రాశి …వారం ప్రారంభంలో వృత్తిపరంగా నూతన మార్పులు, కొత్త అవకాశాలు. అధిక ఆలోచనలు, శ్రమ ఒత్తిడి. మానసిక ఉద్వేగాలు అధికం. హృదయాందోళనను అధిగమించాలి. ముఖ్యంగా సంతానము, ప్రియమైన వ్యక్తులతో మాటలలో ఘర్షణ లేకుండా తగినంత ప్రశాంతత అవసరం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ పై దృష్టి సారించాలి. వారం మధ్యలో మాటలలో వేగం, ఆర్థిక అభివృద్ధి, విందు వినోదాలలో పాల్గొనడం. ప్రత్యర్థులపై విజయ సాధన. పెద్దలతో, కుటుంబ సభ్యులతో ఆర్థిక నిర్ణయాలలో ముఖ్యంగా గృహ అనవసర ఖర్చుల్ని, అహం సమస్యలధిగమించాలి. ఉన్నత విద్యలో గురువుల సహకారం లభ్యం. వారాంతం క్రింద సిబ్బంది సహకారంలో ఇబ్బందులు ఉన్న వ్యక్తిగత కృషితో, గృహ సభ్యుల సహకారం తో పనులు పూర్తి. మంచి కమ్యూనికేషన్. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.