BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

Weekly Horoscope 18 Oct 2026 - 24 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Select Suryaa Now
Weekly Horoscope 18 Oct 2026 - 24 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Weekly Horoscope (Rasi Phalalu) 18.10.2026 నుండీ 24.10.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

ప్రారంభంలో మందిర దర్శనాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, దూరప్రయాణాల రీత్యా, ఒత్తిడి, నిద్రలేమిని అధిగమించాలి. సంభాషణలలో తల్లిదండ్రులతో సమన్వయం ముఖ్యం. గృహ, స్థిరాస్తి వ్యవహారాలలో ప్రశాంతత అవసరం. ఉన్నత విద్య సంబంధ గురువుతో చర్చలు, ఆర్థిక అంశాలలో ఆకస్మిక నిర్ణయాలు. మధ్యలో వృత్తి వ్యవహారాల యందు శ్రమ అధికం, నూతన బాధ్యతలు. తగిన గుర్తింపు గౌరవం. చిన్న చిన్న విషయాలలో ఉద్వేగాలు నియంత్రించుకోవాలి. స్నేహితులతో సమయాన్ని సద్వినియోగం, కీలక చర్చలు. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. భవిష్య ప్రణాళికలు పెద్దలతో ఆలోచనలు. వారాంతం ఆరోగ్య శ్రద్ధ. ఒత్తిడి నిద్రలేమి, అధిక ఆలోచనలు. స్థిరాస్తులకై ఖర్చులు అధికం. డ్రైవింగ్, ప్రయాణాల జాగ్రత్తలు అవసరం. హనుమాన్ చాలీసా మేలు.

వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  

ప్రారంభంలో మిత్రులతో, ప్రయాణాలలో, నిర్ణయా లలో ఘర్షణాత్మక వాతావరణాన్నిఅధిగమించాలి. సజ్జన సహకారాన్ని, ఆర్థిక అంశాలలో ఆకస్మిక లాభాలని,  నూతన పరిచయాలు, నెట్వర్క్ ని సద్వినియోగ పరుచుకోవాలి. భూమి, స్థిరాస్తుల విషయాలలో ఆత్మీయులతో చర్చలు. మధ్యలో దైవిక ఆలోచనలు, మందిరాల దర్శన, తండ్రి పెద్దలతో కీలక నిర్ణయాలు, ఆధ్యాత్మిక వ్యక్తులు ఆశీస్సులు, కలయిక, ఆర్థికవృద్ధి. దూరప్రయాణ ఆసక్తి. వృత్తి పరంగా కొత్త నిర్ణయాలు, ఆకస్మిక అవకాశాలు. వారాంతం వ్యక్తుల సహకారం, తక్కువ శ్రమతో ఆగిన పనులు ముందుకు వెళతాయి. వ్యాపార వ్యవహారాల విషయంలో ఆర్థిక నిర్ణయాలలో, పెట్టుబడులలో వేగాన్ని పెంచుతారు. వీలైనంత వరకు ఆత్మీయుల సహకారంతో నిర్ణయాలు మేలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనమేలు.

మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  

ప్రారంభంలో సాంఘిక సంబంధాలు, స్నేహ బంధాలు వృద్ధి, భాగస్వామ్య వ్యవహారాలు పై దృష్టి, గుర్తింపు  గౌరవం పొందుతారు. వృత్తిలో ఆలస్యాలు ఉన్నా, ఆర్థిక విషయాలు అనుకూలం. కుటుంబ సభ్యులతో డ్పాటు, మాటకి విలువ. సంబంధాలలో కఠిన వాక్కు నియంత్రించుకోవాలి. వృత్తిపరమైన శ్రమ, చికాకులు ప్రశాంతతను తగ్గిస్తాయి. మధ్యలో ప్రయాణాలలో,ఆరోగ్యంలో, ఆర్థిక ఆలోచనలలో ముఖ్యంగా వృత్తిలో అనవసర ఆందోళన లను అధిగమిస్తూ ప్రణాళికలలో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్యం, దూరప్రయాణాలు, సంతాన విద్యలపై దృష్టి. వారాంతం ఆలస్యం, ఆటంకాలు అధిగమించడానికి వృత్తి, ఆర్థిక, కుటుంబపరమైన విషయాలలో అధిక శ్రమ చేస్తారు. మంచి మాటలతో గౌరవాన్ని సాధిస్తారు. శ్రీ దత్తశరణం మమ శ్లోకం మేలు.

కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)

ప్రారంభంలో ఒత్తిడి, ప్రశాంతత తక్కువ. వృత్తిలో ప్రత్యర్థులపై విజయ సాధన కొరకు, సంతాన అభివృద్ధి విషయాలలో కృషి అధికం, ముఖ్యంగా సంతానము, ఆత్మీయ వ్యక్తులతో ఘర్షణలకు, వాదనలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్యవిషయాల పై దృష్టి. అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తి. మధ్యలో సాంఘిక సంబంధాలు, బంధు, మిత్రుల కలయిక, గుర్తింపు గౌరవం. అన్నిచోట్ల మాట విలువ. వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక అంశాలు, దూర ప్రాంతంలో వ్యక్తులతో చర్చలు అనుకూలిస్తాయి. భాగస్వామి సహకారం, వ్యాపారవృద్ధి లభ్యత. అయితే అనవసర ఆందోళనలు, ప్రశాంతతను, గృహసౌఖ్యాన్ని, తగ్గించకుండా అయిన వారితో వాక్కులో వేగాన్ని నియంత్రించుకోవాలి. ఆహార శ్రద్ధ, విశ్రాంతి పై దృష్టి సారించాలి. వారాంతం ఆర్థిక, ఆధ్యాత్మికాలోచనలు, ప్రయాణాలు, ఉన్నతవిద్య ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. దుర్గాదేవిఆరాధన మేలు. 

సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

ప్రారంభంలో సంతాన, దీర్ఘకాల పెట్టుబడులు, దూర ప్రయాణాలలో ఆకస్మిక ఖర్చులు. ఆత్మీయుల ఆరోగ్యంపై దృష్టి. వ్యాపారాలలో, వ్యక్తిగత విషయాలలో, ఆర్థిక వృద్ధికై ఆకస్మిక, వేగవంత నిర్ణయా ల యందు తగిన జాగ్రత్తలవసరం. రుణాంశాలు, ప్రత్యర్థులపై విజయంకై, న్యాయ విషయాలలో ఒత్తిడి, వ్యయము అధికం. మధ్యలో భూ, స్థిరాస్తుల విషయాలలో, పెట్టుబడులలో, కుటుంబంలో పెద్దలతో చర్చలలో, ఘర్షణ అధిగమించాలి. ప్రశాం తంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ, సంఘంలో గుర్తింపు గౌరవం, వ్యాపార విస్తరణపై దృష్టి, ప్రయాణాలకు అవకాశం. వారాంతం పనులు జాప్యం, ముఖ్య వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు. భాగస్వామ్య, కుటుంబ అంశాల ప్రశాంతత, మరియు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. హనుమాన్ మందిరాలు దర్శించడం మేలు.

కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)

ప్రారంభంలో గృహ సౌఖ్యం, విద్య అంశాలు, తల్లితో అనుబంధాలు, స్థిరాస్తి విషయాలు అనుకూలం. స్నేహ సంబంధాలు, ఆలస్యమైన రుణ, ఆర్థిక, భూవ్యవహారాలు కొంత ఆశాజనకం. బంధువుల కలయిక. విద్యార్థులకు అనుకూలం. నూతన ఆహార స్వీకరణ పట్ల ఆసక్తి. తోబుట్టువులతో, ఆత్మీయులతో కలిసి విందు వినోదాలు, ఆధ్యాత్మిక, క్షేత్ర సందర్శన. దైవభక్తి. తక్కువ శ్రమతో పనులు సాధన. వ్యాపార వ్యవహారాల వృద్ధిపై దృష్టి. జీవిత భాగ స్వామి సహకారం. ప్రియమైన వ్యక్తులతో చర్చలు, సమయాన్ని సద్వినియోగ పరచుకుంటారు. మధ్యలో న్యాయ విషయాలు, పోటీలు, రోగ నిరోధక శక్తి అనుకూలం. ఉత్సాహంగా ఆకస్మిక నిర్ణయాలు. నూతన అవకాశాలు. వారాంతం వ్యాపార వ్యవహారాల్లో, మైత్రి బంధాల్లో నూతన పరిచయాలు. సజ్జన సహకారం లభ్యం. ఎదురు చూసిన విష యాలలో అభివృద్ధి.అమ్మవారి ఆరాధన మేలు.

తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

ప్రారంభంలో శ్రమతో అనుకున్న పనులు నైపుణ్యంగా సాధిస్తారు, కృషి శీలత, వృత్తిపరంగా సజ్జన వ్యక్తుల సహకారం, పరాక్రమం తోడ్పడతాయి. ఆలస్యం అవుతున్న, ముఖ్య విషయాలలో కుటుంబ, భాగస్వామ్య ప్రోత్సాహం, మంచి నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళతారు. గృహ వాతావరణం, తల్లి సహకారం, మంచి ఆహారం, విద్య విషయాలలో శ్రద్ధ, పోటీలలో వృద్ధి, విద్యార్థులు ఏకాగ్రత పెంపొందించుకోవాలి. అనవసర విషయాల పైన సమయాన్ని వృధా చేయరాదు. మధ్యలో స్నేహ సంబంధాలు, విందు వినోదాలు, మిత్రులతో, ఆత్మీయులతో సమయాన్ని సద్విని యోగ పరుచుకుంటారు. ముఖ్యంగా సంతాన రీత్యా వారి అభివృద్ధి కొరకు, ప్రియమైన వ్యక్తులతో అనవసర ఆందోళన, వృధా ఆలోచనలు అధిగమించాలి. వారాంతం శ్రమతో అనుకున్న పనులుసాధిస్తారు, నూతన అవకాశాలు, వృత్తిలో సహకారం, గౌరవం. గణపతి ఆరాధన మేలు. 

వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   

ప్రారంభంలో కుటుంబ, సంతాన,అంశాలలో ఘర్షణ. ప్రశాంతత తక్కువ. క్షేత్ర సందర్శన, ఆధ్యాత్మిక ఆలోచనలు, గురువుల ఆశీస్సులు, ఆర్ధిక వృద్ధికై ప్రణాళికలు. దూర ప్రయాణాలకి ఆకస్మిక నిర్ణయాలు, చర్చలు. మిత్రులు, బంధువులతో కలయిక సంభాషణ. శ్రమతో ఆగిన పనులు సాధిస్తారు. మధ్యలో సంతాన ఆలోచనలు, వారి అభివృద్ధి, ఆరోగ్యంలో మీ ఆలోచనలు వారి ఆలోచనలు సమన్వయంలో మీరు ప్రశాంతతపై దృష్టి సారించాలి. మీ వ్యక్తిగత ఆరోగ్యశ్రద్ధ, వాదనలు అధిగమించి విశ్రాంతి, ఆహారస్వీకరణ సమయాలు నిర్లక్ష్యం చేయరాదు. ప్రయాణాలలో శ్రమ అధికం. వారాంతం తల్లి ఆరోగ్యంకై శ్రద్ధ. స్థిరాస్తులు, గృహాపకరణములు, వాహన సంబంధ ఖర్చులు. వృత్తిపరంగా శ్రమ, అధిక బాధ్యతలు. ఆత్మీయ వ్యక్తులకి, షాపింగులు ఖర్చులు. మానసిక ప్రశాంతతకి ఆధ్యాత్మిక, నూతన ప్రదేశ సందర్శన. దత్తమందిరాలు దర్శనమేలు.

ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)

ప్రారంభంలో వ్యక్తిగత ఆరోగ్యం, ఆలస్యమవుతున్న గృహ పరమైన అంశాలలో ఆకస్మిక వ్యయము, కొత్త నిర్ణయాలు, మార్పులు. దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తులు, సంతానవృద్ధి కొరకు ఉద్వేగపూరిత నిర్ణయాలకు, ఘర్షనాత్మక ఆలోచనలు తావివ్వ రాదు. ప్రియమైన వ్యక్తులతో నిర్ణయాలలో అభిప్రాయ బేధాలు లేకుండా సమన్వయం ముఖ్యం. కుటుంబ ఖర్చులు,వాగ్దానాలు నెరవేర్చుకోటానికి చేసే ప్రయత్నాలు, సంతాన ఖర్చులు ప్రణాళిక పరంగా   వెడితే ప్రశాంతత లభ్యం. సంతానం ఆరోగ్య శ్రద్ధ. ముఖ్య వ్యక్తులతో ఆర్ధిక అంశాలలో వాదనలు, దూరం మేలు. మధ్యలో అనుకున్న పనులు శ్రమతో పూర్తి. ఆత్మీయ సిబ్బంది సహకారం, లక్ష్యసాధనలో అనుకూలం. వారాంతం విద్యార్ధులకి విద్యలో ఏకగ్రత, డ్రైవింగ్ పై తగిన దృష్టి అవసరం. తల్లికి గృహ, వాహన అంశాలకి ఖర్చులు చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన మేలు.

మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)

వ్యాపార, భాగస్వామ్య అంశాలలో, స్థిరాస్తులలో శ్రమ ఒత్తిడి అధికం. జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. అనవసర ఆలోచనలు, నిద్రలేమి. సంతానవృద్ధి విషయంలో నిర్ణయాలు. ముఖ్యంగా భూమి గృహ సంబంధ విషయాలలో అధిక శ్రమ. ఆత్మీయ సజ్జన వ్యక్తులు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగపరుచు కోవడంలో ఘర్షణ ఉద్వేగాలను అధిగమించాలి. వాటిరీత్యా చర్చలలోభాగస్వామితో తగిన సమన్వయం అవసరం. మధ్యలో కొత్త నిర్ణయాలు, ఉత్సాహంగ అనుకున్న పనులు సాధించడానికి ఏకాగ్రత లక్ష్యసాధన. సాంఘిక సంబంధాలలో, వ్యక్తులతో సౌమ్యంతో పనులు సాధించాలి. కుటుంబ ఆర్థిక విషయాలనుకూలం. ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన. బంధుమిత్రుల కలయిక. విందు వినోదాలలో పాల్గొంటారు. వారాంతం అనుకున్న పనులు, భాగస్వామి, తోబుట్టువుల సహకారంతో పూర్తి, గృహ వ్యవహారాలభివృద్ధి. గణేష్ ఆరాధన మేలు.

కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    

ప్రారంభంలో ఆశించిన పనులు అనుకూలం, తక్కువ శ్రమతో, నైపుణ్యాలతో, ఆర్థిక వ్యవహా రాలలో, కుటుంబ అంశాలలో ఆలస్యమైన విష యాలలో చక్కని నెట్వర్క్ , వృత్తిలో కొలీగ్స్ సహకారం అనుకూలం. నిద్రలేమి, మానసిక చికాకుని అధిగమించాలి. రోగ నిరోధకశక్తి, ప్రత్యర్థుల మీద విజయ సాధన, రుణ విషయాలు ఆలోచనలు చేస్తారు, వాటి రీత్యా ఖర్చులు అధికం. మధ్యలో ఆత్మవిశ్వాసంతో ఆర్థిక, కుటుంబ అంశాలలో, వాగ్దానాలలో, తీసుకునే నిర్ణయాలలో అధికవేగంకాక ఆత్మీయుల సహకారం ముఖ్యం. వారాంతం నూతన ఋణ ప్రయత్నాలు. దంత ఆరోగ్యశ్రద్ధ అవసరం. మాటలవల్ల అపార్ధాలు రాకుండా ఆర్థిక విషయాలలో, స్థిరాస్తులలో ఆత్మీయులతో సమన్వయంతో చర్చలలో ఘర్షణలు లేకుండా ముందుకు వెళ్లాలి. అమ్మవారి ఆరాధన మేలు

మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

ప్రారంభంలో వృత్తిలో ఆలస్యమైనా, గౌరవం, గుర్తింపు, శ్రమ బాధ్యతలు. ఆధ్యాత్మిక ఆలోచన, ఆర్థికవృద్ధి, ఆత్మీయుల కొరకు శ్రద్ధ, ఒత్తిడి అధికం. ముఖ్య నిర్ణయాలలో ఉద్వేగంతో సంతానంతో, ప్రియమైన వ్యక్తులతో ఘర్షణ, వాదనలు తావివ్వక ఆలోచనలలో సమన్వయం, ప్రశాంతత మేలు. మధ్యలో ఆశించిన విజయాలు, తక్కువ శ్రమతో, నెట్వర్క్ తో ఆగిన పనులు పూర్తి. బంధువులు, చిన్ననాటి మిత్రుల కలయిక. క్షేత్ర సందర్శన, కుటుంబ సహకా రం. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి. ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. వారాంతం పనులలో ఒత్తిడి, నిద్రలేమి. అనవసర ఆందోళన, ఆకస్మిక ఖర్చులు. గృహ వాహనాలు రీత్యా, తల్లి ఆరోగ్య అంశాలలో శ్రద్ధ. ముఖ్య విషయాలలో బద్దకాన్ని అధిగమించాలి, ఆలోచన, నిర్ణయాలలో వాయిదాల వల్ల అవకాశాలు చేజారకుండా జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మేలు.

 

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com