రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ:పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా రైల్వే సిబ్బందికి మోడీ ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ అందించింది. రైల్వే ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) ప్రకటించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇస్తున్నట్లు కేంద్ర కేబినెట్ వెల్లడించింది.
ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 11.40 లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,009 కోట్ల భారీ నిధులను కేటాయించింది. పండుగ వేళ ప్రభుత్వం ప్రకటించిన ఈ దీపావళి బోనస్తో రైల్వే ఉద్యోగ కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.