BREAKING
కొరియాకు బీటీఎస్ చేసినట్లే భారత్‌కు చేయాలన్నదే మా లక్ష్యం.. యువ బాయ్ బ్యాండ్ అవుట్‌స్టేషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఆధిక్యం రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం సీట్ల సర్దుబాటుపై స్పష్టత భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శ శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు ట్రెండింగ్‌లో ‘రాయవలస’ సినిమా మాస్ ఫోక్ సాంగ్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘రింగుడు రింగుడు పిల్లా’! దక్షిణ ఇటలీలో తీవ్రమవుతున్న ఇంధన కొరత ముప్పు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్...సుమారు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనగాని శివప్రసాద్ మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు సెప్టెంబర్ ద్రవ్యోల్బణ డేటాతో వడ్డీ రేట్ల పెంపుపై పెరిగిన అంచనాలు బతుకమ్మ - తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక ఐపీఓ రేసులో జియో ప్లాట్‌ఫామ్స్...దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌కు సన్నాహాలు

పిసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ

Select Suryaa Now
పిసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ

 

 

సూర్య, జన్నారం : జన్నారం మండలం పూనకల్ పంచాయతీ పరిధిలోగల గాంధీనగర్ కాలనీలో బుధవారం పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా రెండు వందల చీరలను మహిళలకు అందజేసి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆలోచనతోనే ఈ కాలనీ మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్నామని, ఆకలితో అలమటిస్తున్న వారిని సైతం ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పిసిఆర్ ఫౌండేషన్ సభ్యులు కానుగంటి దేవయ్య, నోముల రాజకుమార్, యాదగిరి కృష్ణారావు, దుర్గం తిరుపతి, సకినాల భూమేష్, స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాజుల లింగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.