దుర్గామాత శరన్నవరాత్రుల ఉత్సవాలకు ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ విరాళం అందజేత
సూర్య, జన్నారం : జన్నారం మండలం ధర్మారం గ్రామంలో తొలిసారిగా నిర్వహిస్తున్న దుర్గామాత దేవి శరన్నవరాత్రుల పూజ మహోత్సవాల సందర్భంగా ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై మూడు వేల ఒక వంద పదమూడు రూపాయల విరాళాన్ని బుధవారం నిర్వాహకులకు అందజేశారు. దుర్గామాత సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆలోచనతో గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మొత్తాన్ని సమకూర్చడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో సైతం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. విరాళాన్ని అందజేసిన వారిలో ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మగ్గిడి తిరుపతి, రాజు, కట్కూరి లచ్చన్న, రాజలింగు, రమేష్, రాజారావు, హరికృష్ణ, సుదర్శన్, భగవాన్ దాసు లతోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.