BREAKING
ప్రజల ప్రాణాల కోసం పోరాడిన చేతులు.. నేడు న్యాయం కోసం నినదిస్తున్నాయి.కోవిడ్ సేవలు మరువొద్దు.. NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి. డా. బాలకృష్ణ_ దోశలు వేస్తూ ప్రజలతో ఉమేకమైన తెదేపా అభ్యర్థులు. ఇంకొల్లులో 11 నామినేషన్లు ఉపసంహరణ వైభవంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు రాహుల్ విజయ్ 'అ' (AH) సినిమా విడుదల తేదీ మార్పు.. నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా విశ్రాంత జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ బిర్యానీ తినిపించారు.. జ్యూస్ కలపిచ్చారు షరణి మాస్ ప్లాన్‌కి నెల్లూరు షేక్ ఆంధ్ర వైద్య కళాశాలలో పీజీ కోర్స్ లో కొత్త విద్యార్థుల ప్రవేశాలకు శ్రీకారం విద్యార్థి దశ దేశభక్తికి బంగారు బాట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక కొమురం భీమ్ ఆశయాలను కొనసాగించాలి: నైతం లక్ష్మణ్ వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం కే జి హెచ్ వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు పై వైద్యాధికారులు దృష్టి సారించాలి వత్సవాయి మండలంలో 17 ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ

యష్ బ్యానర్‌లో 'రామాయణ్'

Select Suryaa Now
యష్ బ్యానర్‌లో 'రామాయణ్'

నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక బ్రహ్మాండ చిత్రం 'రామాయణ్' విడుదలకు సిద్ధమవుతుండగా, ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం నవంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా కర్ణాటక మార్కెట్‌కు సంబంధించి ఒక కీలక వార్త వెలువడింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో భారీ స్థాయిలో పంపిణీ చేయడానికి హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం వెలువడింది.

భారతీయ ఇతిహాస ఆధారంగా తెరకెక్కుతున్న ఈ దృశ్యకావ్యంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, యష్ స్వయంగా ఈ చిత్రంలో 'రావణాసురుడి' పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన సొంత సంస్థ ద్వారా కర్ణాటకలో ఈ సినిమాను పంపిణీ చేస్తుండటంతో కన్నడ చిత్రసీమలో ఈ క్రేజ్ మరింత పెరిగింది.

భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్ 5న విడుదల కానున్న ఈ దృశ్య అద్భుతాన్ని వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.